gadkari: ఇలా జరుగుతుందని ముందే చెప్పానుగా.. నా వ్యాఖ్యల అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోవచ్చు: గడ్కరీ

షార్ట్స్‌లో చూడండి
ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. 'క్రికెట్, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని నేను ముందే చెప్పాను. నా మాటలకు అర్థం ఏంటో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు' అని చమక్కులు వదిలారు.

కాగా, ఈ రోజు సాయంత్రం ఎన్సీపీ అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలతో భేటీ అవుతోంది. అనేక ట్విస్టులతో ముందుకు వెళుతోన్న 'మహా' రాజకీయాల్లో ఈ ట్విస్టులు ఇక్కడితో ఆగలేదనే చెప్పకోవచ్చు. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఇప్పటికీ ఉంది.
Go Back to Shorts
gadkari
BJP
shiv sena

More Telugu News