Maharashtra: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ విపరీతంగా మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి బీజేపీకి మద్దతివ్వడంపై ట్వీట్ చేశారు. శరద్ పవార్ 1978లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారని, ఆ మరుసటి రోజే పార్టీని చీల్చి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని వెల్లడించారు. ఇప్పుడు అజిత్ పవార్ రూపంలో అదే అనుభవం ఆయనకు ఎదురైందని, అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు తెలుస్తోందని హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Maharashtra
BJP
Congress
NCP
Shivsena
Sharad Pawar
Ajit Pawar

More Telugu News