YSRCP: వైసీపీ 'రంగు' రాజకీయాలపై రజనీకాంత్ డైలాగ్ తో నారా లోకేశ్ ట్వీట్!

  • విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు
  • బాషా సినిమాలోని డైలాగును పోస్ట్ చేసిన లోకేశ్
  • ముందు కలరేశారు, బెడిసి కొట్టి కవర్ చేశారని ఎద్దేవా
విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం దిమ్మెకు వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న విషయంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ.. బాషా సినిమాలోని రజనీకాంత్ డైలాగును ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విలన్ కు బదులిస్తూ ఇందులో రజనీకాంత్ 'అక్కడ చూడు' అనే ఫేమస్ డైలాగు ఇందులో ఉంది. ఈ వీడియోకు వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న ఫొటోలను జతచేసి ఆయన ట్వీట్ చేశారు.

'ముందు కలరేశారు, బెడిసి కొట్టి కవర్ చేశారు. అప్పటికైనా మారారా?.. లేదు.. బుద్ధి చూపించుకున్నారు. చివరికి బోర్లా పడ్డారు' అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇటీవల    అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. మళ్లీ ఆ పార్టీ ఇటువంటి తీరే కనబర్చడంతో విమర్శలు వచ్చాయి. అయితే, ఈ ఫొటో నకిలీదంటూ వైసీపీ చెబుతోంది. దీనిపైనే స్పందిస్తూ లోకేశ్.. ఈ విమర్శలు చేశారు.
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News