ncp: ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్ తొలగింపు?

  • కాసేపట్లో ప్రకటన
  • వైబీ చవాన్ సెంటర్ చేరుకున్న శరద్ పవార్, ఉద్ధవ్
  • శరద్ పవార్ తో కలిసి వచ్చిన కూతురు సుప్రియా సూలె
  • ఉద్ధవ్ తో వచ్చిన కుమారుడు ఆదిత్య
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలె, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేతో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ ను ఆ హోదా నుంచి తొలగించే యోచనలో శరద్ పవార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో మీడియాకు ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.
ncp
shiv sena
Maharashtra

More Telugu News