Police: భర్తతో వివాదం... హుస్సేన్ సాగర్‌లో దూకిన మహిళ.. రక్షించిన పోలీసులు

  • ఆసుపత్రిలో చికిత్స
  • ఏఎస్ రావు నగర్ కు చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన లేక్ సిబ్బంది ఆమె ప్రాణాలను కాపాడారు. ఆమెను హుస్సేన్ సాగర్ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆమె హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కు చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యాయత్న ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తతో విభేదాల కారణంగానే తాను ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది.
Police
Hyderabad
Crime News

More Telugu News