Supriya Sule: వాట్సాప్ స్టేటస్ లో సంచలన వ్యాఖ్య చేసిన శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె

  • పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక
  • ఈ వాట్సాప్ స్టేటస్ ఆమెదేనని నిర్ధారించిన ఆమె కార్యాలయ సిబ్బంది
  • తమ పార్టీ ఎమ్మెల్యేలతో సాయంత్రం 4.30 గంటలకు శరద్ పవార్ భేటీ
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె తన వాట్సాప్ స్టేటస్ లో ఓ ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు. 'పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక వచ్చింది' అని అన్నారు. ఈ వాట్సాప్ స్టేటస్ ఆమెదేనని ఆమె కార్యాలయ సిబ్బంది కూడా నిర్ధారించారు.  

కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలపై చర్చించడానికి తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశం ఏర్పాటు చేశారు.
Supriya Sule
Sharad Pawar
Whatsapp

More Telugu News