Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

  • రెండు మినీ బస్సులు ఢీ
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
  • అతివేగమే ప్రమాదానికి కారణం
రాజస్థాన్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగోర్ జిల్లాలోని కుచామన్ పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వచ్చిన రెండు మినీ బస్సులు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan
Road Accident

More Telugu News