Vijayawada: విజయవాడలో స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం.. పోలీసుల దాడులు

  • ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకుని దందా
  • దాడుల్లో పట్టుబడిన యువతులు, నిర్వాహకులు
  • ఉక్కుపాదం మోపుతున్నామన్న కమిషనర్
విజయవాడలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పాలు, మసాజ్ సెంటర్ల పేరుతో విచ్చలవిడిగా నడుస్తున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకుని అందులో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో కొన్ని మసాజ్ సెంటర్లు, స్పాలపై దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు యువతులు, నిర్వాహకులు, విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్  ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇటువంటి దందాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఉపేక్షించబోమని సీపీ హెచ్చరించారు.
Vijayawada
Andhra Pradesh
spa
massage centers

More Telugu News