Whatsap settings: వాట్సప్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటూ.. సైనికులకు అధికారుల సూచన

  • ఐఎస్ఐ గూఢచార సంస్థ భారత జవాన్లపై కుట్ర పన్నుతోంది
  • మీకు తెలియకుండానే మీ నెంబర్ ను తమ వాట్సప్ గ్రూపులో చేర్చుతోంది
  • ఫోన్ కాంటాక్టుల్లోని వ్యక్తులు మాత్రమే గ్రూపుల్లో చేర్చేలా సెట్టింగ్స్ చేసుకోవాలి
తమ ఫోన్లలో వాట్సప్ సెట్టింగ్స్ ను వెంటనే మార్చుకోవాలని భారత సైనికాధికారులు తమ సిబ్బందికి సూచించారు. భారత భద్రత బలగాలే లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్రలు చేస్తోందని భారత సైనికాధికారులు చెబుతున్నారు. ఇటీవల ఓ సైనికుడి ఫోన్ నెంబర్ ను పాకిస్థాన్ కు చెందిన ఓ అనుమానిత ఫోన్ నెంబర్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో చేర్చినట్లు తెలిపారు. దీన్ని గుర్తించిన ఆ సైనికుడు ఆ గ్రూప్ నుంచి వైదొలిగి ఆ గ్రూప్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకున్నట్లు తెలిపారు.

ఇటీవల పాక్ గూఢచారులు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఇద్దరు భారత సైనికులపై ప్రేమ వల విసిరిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైనిక సిబ్బందే కాక వారి కుటుంబ సభ్యులు కూడా తమ ఫోన్లలో వాట్సప్ సెట్టింగ్స్ మార్చుకోవాలని అధికారులు సూచించారు. తమ ఫోన్ కాంటాక్టుల్లోని వ్యక్తులు మాత్రమే గ్రూపుల్లో చేర్చేలా సెట్టింగ్స్ ను మార్పు చేసుకోవాలని పేర్కొన్నారు.
Whatsap settings
ARmy suggestion
to subordinates
soldiers
change settings to limit to contact lists
Only

More Telugu News