Roja: మీలాగా మావాళ్లు బరితెగించలేదు... సుజనా చౌదరిపై రోజా వాడీవేడి వ్యాఖ్యలు

  • వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న సుజనా
  • మండిపడిన రోజా
  • కేసులకు భయపడి బీజేపీ నేతల కాళ్లుపట్టుకున్నారని విమర్శలు
వైసీపీ నేతలు కొందరు బీజేపీతో టచ్ లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తీవ్రంగా స్పందించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని భయపడే సుజనా బీజేపీలో చేరారని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ నామరూపాల్లేకుండా పోవడంతో కేసులకు భయపడి బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుని సుజనా ఆ పార్టీలో చేరారని, ఇప్పుడేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని మండిపడ్డారు.

ఆయనలాగా తమ పార్టీ నేతలు బరితెగించరని, తమ పార్టీ నేతలు బీజేపీలో చేరాల్సిన అవసరం ఏముందో సుజనా చెప్పాలని నిలదీశారు. తనలాగే అందరూ తప్పులుచేసి బీజేపీలో చేరతారని సుజనా భావిస్తున్నట్టుందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచరాజకీయాలు చేసే చంద్రబాబు వంటి నాయకుడ్నే ఎదుర్కొన్న వైసీపీ నేతలు ఈరోజు సుజనా చౌదరితో కలిసి మరో పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.
Roja
Sujana Chowdary
YSRCP
Telugudesam
BJP

More Telugu News