T Rajendar: రజనీకాంత్, కమలహాసన్ ల రాజకీయాల గురించి నన్ను అడగడంలో అర్థం లేదు: టి.రాజేందర్

  • కమల్, రజనీ పాలిటిక్స్ పై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధి
  • వాళ్లిద్దరి కంటే తానే సీనియర్ నని వెల్లడి
  • ఇప్పటి రాజకీయాల గురించి మాట్లాడలేనని వ్యాఖ్యలు
ప్రేమసాగరం వంటి డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకనటుడు టి.రాజేందర్ తాజాగా తమిళ రాజకీయాలపై స్పందించారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకుంటున్న కమలహాసన్, రజనీకాంత్ లపై స్పందించాలని ఓ మీడియా ప్రతినిధి కోరగా, వాళ్లిద్దరి రాజకీయాల గురించి తనను అడగడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.

 కమల్, రజనీల కంటే రాజకీయాల్లో తాను ఎంతో అనుభవజ్ఞుడ్నని అన్నారు. అయితే రాజకీయాల్లో అనుభవం ఒక్కటే సరిపోదని, కాస్తంత అదృష్టం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఇప్పటి పరిస్థితులు చూసిన తర్వాత వాటిపై స్పందించడమే మానుకున్నానని తెలిపారు.
T Rajendar
Rajinikanth
Kamal Haasan
Tamilnadu

More Telugu News