Crime News: తమిళనాడులో ఘోరం... మహిళకు కాన్పు చేసి ఆమె కడుపులో సూది పెట్టి కుట్టేసిన వైద్యులు

షార్ట్స్‌లో చూడండి
ఆసుపత్రిలో ఓ మహిళకు కాన్పు చేసిన వైద్యులు ఆమె కడుపులో సర్జికల్ సూదిని వదిలేసిన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లిలో చోటు చేసుకుంది. రమ్య (21) ఈ నెల 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

అయితే, రమ్యకు కడుపు నొప్పి, రక్త స్రావం కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రమ్యకు స్కాన్‌ చేసిన వైద్యులు ఆమె కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు ఆసుపత్రిలో కాన్పు చేసిన సమయంలో సూదిని లోపలే ఉంచి కుట్లువేసినట్లు వారు తెలిపారు.

ప్రస్తుతం ఆపరేషన్‌ కోసం రమ్య మధురై ఆసుపత్రిలో ఉంది. రమ్య కడుపులో సూదిని వదిలేయడం పట్ల ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైన వైద్యులను, సిబ్బందిని విధుల్లోనుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Crime News
Tamilnadu
Tamil Nadu

More Telugu News