Botsa Satyanarayana: మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ?: పవన్ కల్యాణ్
- విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ రంగులు
- మండిపడ్డ పవన్
- బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో ఈ తీరు కనపడిందని వ్యాఖ్య
విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 'వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???' అని పవన్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేసి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.
కాగా, ఇటీవల అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.