Rakul Preet Singh: ఓ హీరో నా వద్ద ఆ ప్రపోజల్ తీసుకొచ్చాడు.. కుదరదని చెప్పా!: రకుల్ ప్రీత్ సింగ్

  • క్యాస్టింగ్ కౌచ్ నాక్కూడా ఎదురైంది
  • ఓ స్టార్ హీరో శృంగారం కోసం ప్రపోజ్ చేశాడు
  • అలాంటివి నాకు సరిపోవని చెప్పా
మన దేశంలో 'మీ టూ' ఉద్యమం ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుంచి ఇతర రంగాలలోని ప్రముఖుల వరకు అనేక మంది దీని బారిన పడ్డారు. గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎందరో మహిళలు ధైర్యంగా తమ గళాన్ని వినిపించారు. తాజాగా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన గత అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

క్యాస్టింగ్ కౌచ్ తనకు ఎదురు కాలేదని చెబితే అది అబద్ధమే అవుతుందని రకుల్ తెలిపింది. ఓ స్టార్ హీరో తనతో శృంగారం కోసం ప్రపోజ్ చేశాడని చెప్పింది. అయితే, ఎంతో మర్యాద పూర్వకంగా తనను అడిగాడని తెలిపింది. ఆయన మాట వినగానే తనకు చాలా కోపం వచ్చిందని... అయితే, అలాంటివి తనకు సరిపోవంటూ తాను చాలా కూల్ గా చెప్పానని వెల్లడించింది. అయితే, ఆ హీరో ఎవరో మాత్రం రకుల్ చెప్పలేదు.
Rakul Preet Singh
Tollywood
Casting Couch
MeeToo

More Telugu News