TSRTC: ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి ప్రకటన

  • సమ్మెను విరమిస్తామన్నా పట్టించుకోలేదు
  • కార్మికుల వల్ల ఆర్టీసీ నష్టపోలేదు
  • రేపటి నుంచి మళ్లీ నిరసనలకు దిగుతున్నామన్న జేఏసీ
రెండు రోజుల క్రితం ప్రభుత్వం బేషరతుగా ఆహ్వానిస్తే, సమ్మెను విరమిస్తామని ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, నేడు మాట మార్చారు. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం రాలేదని, ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ నష్టాల్లో ఉందని ఆరోపించిన ఆయన, సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు.

తాము ఎన్నో మెట్లు దిగొచ్చి, సమ్మెను విరమిస్తామని ప్రకటించినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. శనివారం నాడు అన్ని డిపోల వద్దా సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలకు దిగనున్నామని తెలిపారు. తమకు డ్యూటీలు వేయాలని ఎవరూ అధికారుల వద్దకు వెళ్లవద్దని ఆయన సూచించారు. రేపు మరోసారి జేఏసీ నేతల సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
TSRTC
Strike
Ashwadhama Reddy

More Telugu News