Chandrababu: వైఎస్ జగన్ ప్రభుత్వం తన నిజమైన 'రంగులు' చూపెడుతోంది!: చంద్రబాబు ధ్వజం
- ఇటీవల జాతీయ జెండాను అవమానించారు
- వచ్చిన విమర్శల నుంచి కూడా వైసీపీ నేర్చుకోలేదు
- విజయనగరంలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ రంగులు
వైసీపీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'ఇటీవల జాతీయ జెండాను అవమానించడంతో వచ్చిన విమర్శల నుంచి కూడా వైసీపీ నేర్చుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోంది. విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్నారు. ఎందుకీ దురహంకారం?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇటీవల జాతీయ జెండాలోని మూడు రంగులను కనపడకుండా వైసీపీ తమ పార్టీ రంగులు వేసుకున్న ఫొటోతో పాటు తాజాగా గాంధీజీ విగ్రహం కింద వేసుకున్న రంగుల ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. కాగా, ఇటీవల అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే.