mohan babu: మీ సినీ ప్రయాణం మాకు స్ఫూర్తి నాన్న: మంచు మనోజ్

  • 44 ఏళ్ల మీ సినీ ప్రయాణం మీకు ఓ అనుభవం కావచ్చు
  • మాకు మాత్రం స్ఫూర్తిగా నిలుస్తోంది
  • సినీ పరిశ్రమలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు
సినీనటుడు, తన తండ్రి మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమలో మోహన్ బాబు 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.

'ఈ 44 ఏళ్ల మీ సినీ ప్రయాణం మీకు ఓ అనుభవం కావచ్చు.. మాకు మాత్రం స్ఫూర్తిగా నిలుస్తోంది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు నాన్న. సినిమా ద్వారా ఎదిగి చాలా మందికి విద్య, జీవనోపాధి కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.     కాగా, మోహన్ బాబు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. 500కు పైగా సినిమాల్లో నటించారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు.
mohan babu
manoj
Tollywood

More Telugu News