Ayodhya: శ్రీరామచంద్రునికి అయోధ్య తీర్పు కాపీ... ఆదివారం నాడు అందించనున్న పరాశరన్, లాయర్లు!

  • ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు
  • 24న అయోధ్యకు న్యాయవాదుల బృందం
  • రివ్యూపై 26న నిర్ణయం తీసుకోనున్న సున్నీ బోర్డు
అయోధ్య వివాదంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని శ్రీరామచంద్రుడికి అందించాలని రామ్ లల్లా తరఫు న్యాయవాదులు నిర్ణయించారు. ఈ నెల 24న సుప్రీంకోర్టు న్యాయవాది కేశవ పరాశరన్ నేతృత్వంలోని 24 మంది న్యాయవాదుల బృందం, శ్రీరాముడికి తీర్పును అందజేసి, హనుమాన్ గుడిని సందర్శించనుంది. ఇదిలావుండగా, అయోధ్య రామాలయం నిర్మాణంపై కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని మరో పిటిషన్ వేయాలా? వద్దా? అనే అంశంపై సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఈనెల 26న నిర్ణయం తీసుకోనుందని బోర్డు చైర్మన్‌ జుఫర్‌ ఫరూఖీ తెలిపారు.
Ayodhya
Supreme Court
Sri Raj
Copy
Verdict

More Telugu News