Rajinikanth: పార్టీ ఏర్పాటు చేయకుండా అద్భుతాల గురించి మాట్లాడడం సరికాదు: రజనీకి పళనిస్వామి కౌంటర్

  • 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందన్న రజనీకాంత్
  • ముందు పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత మాట్లాడాలని పళనిస్వామి హితవు
  • ట్యూటికోరన్ లో మీడియాతో మాట్లాడిన సీఎం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 2021లో జరిగే ఎన్నికల్లో అద్భుతం జరుగుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా అద్భుతాలు జరుగుతాయని చెప్పడం సరికాదని హితవు పలికారు. ఏ లెక్కన 2021లో అద్భుతం జరుగుతుందో రజనీకాంతే చెప్పాలని అన్నారు. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతామని పళనిస్వామి తెలిపారు. ట్యూటికోరన్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rajinikanth
Palaniswamy
Tamilnadu
Kamal Haasan

More Telugu News