Green Challenge]: హాస్యనటుడు బ్రహ్మానందంకు బిత్తిరి సత్తి గ్రీన్ ఛాలెంజ్

  • బ్రహ్మానందంకు ఓ మొక్క అందజేత
  • వాతావరణ కాలుష్యం నియంత్రణకు గ్రీన్ ఛాలెంజ్ ఓ అద్భుత అస్త్రం
  • గ్రీన్ ఛాలెంజ్ లో ప్రజలందరూ పాలుపంచుకోవాలని పిలుపు
తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఊపుమీద కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా టీవీ యాంకర్, సినీ నటుడు బిత్తిరి సత్తికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. దీంతో సత్తి మూడు మొక్కలు నాటి తన పని పూర్తి చేసి.. హాస్య నటుడు బ్రహ్మానందం, కల్వకుంట్ల హిమాన్షురావు, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేం శివజ్యోతికి మొక్కలు నాటాలని సవాల్ చేశాడు.

ఇందులో భాగంగా బ్రహ్మానందంను కలసి ఓ మొక్కను సత్తి అందజేశాడు. ఈ సందర్భంగా బ్రహ్మానందంతో కలిసి ఆయన ఫొటోలకు పోజిచ్చాడు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నియంత్రణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత అస్త్రమని సత్తి పేర్కొన్నాడు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని చెప్పాడు.
Green Challenge]
Given by Bittiri Satti
To comedian Bramnanandam

More Telugu News