Anasuya: 'జబర్దస్త్' స్టేజ్ పై సందడి చేయనున్న శ్రీముఖి

  • 'జబర్దస్త్' టీమ్ లో గందరగోళం 
  •  కొంతమంది బయటికెళ్లారని టాక్ 
  • అనసూయ స్థానంలో శ్రీముఖి
'జబర్దస్త్' కామెడీ షోపై గతంలో ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా, రేటింగ్ పరంగా ఎంతమాత్రం తగ్గకుండా దూసుకెళుతూ వచ్చింది. ఈ వేదికపై నుంచి చాలామంది పాప్యులర్ అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు సినిమాలతోను బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలోనే 'జబర్దస్త్' టీమ్ లోని వాళ్లలో చీలిక ఏర్పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.

నాగబాబుతో పాటు మరికొందరు ఆర్టిస్టులు వేరే ఛానల్ కి వెళ్లిపోయారు. అక్కడి షోలో నాగబాబుతో పాటు మరో జడ్జిగా అనసూయ కనిపించే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే ఒకరకంగా ఆమెకి ప్రమోషన్ వచ్చినట్టే. ఇక 'జబర్దస్త్'లో అనసూయ ప్లేస్ లో శ్రీముఖి సందడి చేయనుందనేది తాజా సమాచారం. శ్రీముఖి గ్లామర్ .. ఆమె చేసే సందడి ఈ వేదికపై చూడొచ్చని అంటున్నారు. ఇక ఎటొచ్చి రష్మీ విషయంలోనే స్పష్టత రావలసి వుంది.
Anasuya
Sri Mukhi

More Telugu News