Team India: పింక్ బంతితో భారత ఆటగాళ్ల ప్రాక్టీసు.. ఫొటోలు ఇవిగో!

  • రేపటి నుంచి టీమిండియా-బంగ్లాదేశ్ డే/నైట్ టెస్టు
  • ముమ్మరంగా సాధన చేస్తున్న భారత ఆటగాళ్లు
  • భారత్ కు ఇదే తొలి డే/నైట్ టెస్టు
అంతర్జాతీయ క్రికెట్లో చాలా జట్లు ఇప్పటికే డే/నైట్ టెస్టులు ఆడినా, టీమిండియా ఇన్నాళ్లకు మొగ్గుచూపింది. రేపటి నుంచి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో తొలి డే/నైట్ టెస్టు ఆడేందుకు భారత్ ముమ్మరంగా సన్నద్ధమవుతోంది. గత కొన్నిరోజులుగా ఇండోర్ లోని క్రికెట్ స్టేడియంలో పింక్ బాల్ తో ప్రాక్టీసు చేసిన కోహ్లీ సేన, రెండ్రోజులుగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఎవరి చేతిలో చూసినా పింక్ బంతే కనిపిస్తూ తొలి డే/నైట్ టెస్టుపై అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు, కోల్ కతాలో పింక్ బాల్ టెస్టు నేపథ్యంలో నగరంలోని కొన్ని భవనాలు పింక్ కలర్ లైటింగ్ లో జిగేల్మమంటున్నాయి.
Team India
Bangladesh
Kolkata
Eden Gardens
Pink Ball
Day And Night Test
Cricket

More Telugu News