Amit Shah: మీరే చెప్పండి.. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలా? వద్దా?: అమిత్ షా

  • జార్ఖండ్ లో అమిత్ షా పర్యటన
  • గతంలో కాంగ్రెస్ పార్టీ అయోధ్య కేసును ముందుకు కదలనివ్వలేదు
  • ఇప్పుడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది
  • రామమందిరం నిర్మించేందుకు మార్గం సుగమమైంది
కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ లాతెహార్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.  

'మీరే చెప్పండి.. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలా? వద్దా? కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ కేసును ముందుకు కదలనివ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు మార్గాన్ని సుగమం చేసింది' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

ఇటీవల ఎన్నికల కమిషన్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. 81 స్థానాలు ఉన్న అసెంబ్లీకి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో ఈ నెల 30న 13 అసెంబ్లీ స్థానాలకు,  రెండో దశలో డిసెంబర్ 7న 20 స్థానాలకు , మూడో దశలో డిసెంబర్ 12న 17 స్థానాలకు , నాలుగో దశలో డిసెంబర్ 16న 15 స్థానాలకు, ఐదో దశలో  డిసెంబర్ 20న 16 స్థానాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 23న కౌంటింగ్ జరుగుతుంది.
Amit Shah
BJP

More Telugu News