Narendra Modi: 'రాజుగారూ బాగున్నారా' అంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అప్యాయంగా పలకరించిన మోదీ

  • పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద పలకరింపు
  • రాజ్యసభ నుంచి తన ఛాంబర్ కు వెళుతూ మోదీ ముచ్చట
  • రఘురామ కృష్ణంరాజు పక్కనే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 
ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును  ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యసభ నుంచి తన ఛాంబర్ కు వెళుతూ సెంట్రల్ హాల్ లో ఆయనతో మాట్లాడారు. రఘురామ కృష్ణంరాజు పక్కనే నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు.

రఘురామ కృష్ణంరాజు మొదట బీజేపీలో ముఖ్య నేతగా పనిచేశారు. కొన్ని పరిస్థితుల వల్ల బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. చివరకు మళ్లీ  వైసీపీ తీర్థం పుచ్చుకొని లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఇటీవల బీజేపీ నేతలతో చాలా క్లోజ్ గా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీని నేరుగా కలవద్దంటూ వైసీపీ ఎంపీలను ఏపీ సీఎం జగన్ హెచ్చరించారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు తారసపడిన మోదీని చూడగానే కృష్ణంరాజు వినయ పూర్వకంగా 'నమస్తే సర్' అంటూ పలకరించారు. బదులుగా మోదీ 'రాజుగారూ బాగున్నారా?' అంటూ విష్ చేశారు.
Narendra Modi
parliament
New Delhi

More Telugu News