Olivia Morris: మీ స్పందన అద్భుతం: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాయిక ఒలీవియా మోరిస్

  • ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్‌
  • నిన్న వెల్లడించిన చిత్రం బృందం
  • తన పాత్ర పట్ల వస్తోన్న స్పందనకు ఒలీవియా ధన్యవాదాలు 
రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నట్లు ఆ సినిమా బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై వస్తోన్న స్పందన పట్ల ఆమె స్పందించింది.

'ఈ సినిమాలో నా పాత్ర పట్ల వస్తోన్న స్పందన పట్ల నిజంగా ఆనందంలో మునిగితేలుతున్నాను. ఇంతటి ఘన స్వాగతం పలుకుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను' అని తెలిపింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్..  విప్లవ యోధుడు కొమరం భీమ్‌ పాత్రలో కనపడనున్నాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు. ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ, హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్‌ విలన్లుగా నటిస్తున్నారు.



Olivia Morris
rrr
Rajamouli
ntr

More Telugu News