Desaster Vehicles: జీహెచ్ఎంసీ చేతిలో మరో అస్త్రం... అధునాతన డిజాస్టర్‌ రెస్పాన్స్ ఫోర్స్‌ వాహనాలు ప్రారంభం!

  • విపత్కర పరిస్థితుల్లో వినియోగించేలా వాహనాలు
  • వాహనాల్లో జనరేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు
  • పనితీరును కేటీఆర్ కు వివరించిన అధికారులు
ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా, వెంటనే స్పందించి, ఆ ప్రాంతానికి వెళ్లి, పరిస్థితులకు అనుగుణంగా స్పందించే అన్ని రకాల పరికరాలతో నిండిన అధునాతన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ కు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మొత్తం 8 వాహనాలను సిబ్బందికి అందించారు. విపత్తుల నివారణకై ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో ఒక్కొక్కదానిలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగిన బాక్సులు, జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్లు తదితర పరికరాలు ఉంటాయి. వాహనాల పనితీరును, పరికరాల ఉపయోగాన్ని అధికారులను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు.
Desaster Vehicles
KTR
Telangana
Hyderabad

More Telugu News