Vijayawada: 30 మంది అమ్మాయిలకు ఒకేసారి అనారోగ్యం... విజయవాడ 'స్టెల్లా మేరీ' కాలేజీలో కలకలం!

  • ఫుడ్ పాయిజన్ జరిగిందని ప్రచారం
  • కొట్టి పారేసిన కళాశాల యాజమాన్యం
  • ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత
 విజయవాడలోని ప్రఖ్యాత స్టెల్లా మేరీ కాలేజీలో ఈ ఉదయం ఒకేసారి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వీరంతా హాస్టల్ లో ఉన్నవారేనని తెలుస్తుండటంతో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి, చికిత్స చేయిస్తున్నారు.

జరిగిన ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం, ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తలను కొట్టి పారేసింది. వారంతా వైరల్ ఫీవర్ కు గురయ్యారని వివరణ ఇచ్చింది. అయితే, ఒకేసారి 30 మందికి వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు మాత్రం యాజమాన్యం సమాధానం ఇవ్వలేదు. ఇక ఆసుపత్రుల్లో చేరిన వారిని పరామర్శించేందుకు వారివారి బంధుమిత్రులు తరలిరావడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
Vijayawada
Stella
College
Food Poison

More Telugu News