Nayanathara: మరోసారి వెజిటేరియన్ గా మారిన నయనతార

  • 'ముక్తి అమ్మన్' చిత్రంలో దేవత పాత్రను పోషిస్తున్న నయన్
  • నాన్ వెజ్ ముట్టుకోకూడదని నిర్ణయించుకున్న నయనతార
  • 'శ్రీరామరాజ్యం' సమయంలో కూడా నాన్ వెజ్ కు దూరంగా ఉన్న నయన్
దక్షిణాదిన అగ్ర నటిగా కొనసాగుతున్న నయనతార మరోసారి వెజిటేరియన్ గా మారింది. ప్రస్తుతం ఆమె 'ముక్తి అమ్మన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కన్యాకుమారి అనే దేవత పాత్రను పోషిస్తోంది. దీంతో, మాంసాహారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించింది.

గతంలో 'శ్రీరామరాజ్యం' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమె నాన్ వెజ్ ను ముట్టుకోలేదు. ఆ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా క్రిస్టియన్ అయిన నయనతార... దేవతల సినిమాలను చేసే సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండటం గొప్ప విషయమే. ఇలాంటి సినిమాలు చేసే సమయంలో ఆమె చాలా నిష్టగా ఉంటుంది. మరోవైపు, ప్రస్తుతం ఆమె 'దర్బార్' సినిమాలో రజినీకాంత్ సరసన నటిస్తోంది.

Nayanathara
Tollywood
Vegetarian
Non Veg

More Telugu News