Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు దిశానిర్దేశం చేసే పాత్రలో రమ్యకృష్ణ

  • పూరి దర్శకత్వంలో రూపొందనున్న 'ఫైటర్'
  • మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథ
  • జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
తెలుగు .. తమిళ భాషల్లో రమ్యకృష్ణ ఇప్పుడు చాలా బిజీగా వుంది. కీలకమైన .. పవర్ఫుల్ పాత్రల కోసం దర్శక నిర్మాతలు ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారు. తన స్థాయికి తగిన పాత్రలనే ఎంచుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. అలా ఆమె త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే 'ఫైటర్' చిత్రంలో చేయనుంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఎలా వుండనుందోననే ఆసక్తి అభిమానుల్లో చోటుచేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి దిశానిర్దేశం చేసే కీలకమైన పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. ఆమె సూచనలమేరకే తన రూటు మార్చుకుని, మార్షల్ ఆర్ట్స్ లో ఎదుగుతాడని చెబుతున్నారు. కథా పరంగా విజయ్ దేవరకొండను మందలిస్తూ .. హెచ్చరిస్తూ ఆయనను ముందుకు నడిపించే రమ్యకృష్ణ పాత్ర, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Vijay Devarakonda
Puri Jagannadh
Ramyakrishna

More Telugu News