Pawan Kalyan: తెలుగు లేకుండా తెలంగాణ ఉద్యమం ముందుకెళ్లేదా?. తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?: పవన్ కల్యాణ్

  • మాతృ భాషకు ప్రాధాన్యతను ఇవ్వాలి
  • భాష లేనిదే సంస్కృతి లేదు
  • నదీజలాల కాలుష్యం మీద కూడా ఏపీ పాలకులు ఆలోచించాలి
మాతృ భాష తెలుగుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సూచించారు. తెలుగు లేకుండా తెలంగాణ ఉద్యమం ముందుకెళ్లేదా? అని ప్రశ్నించిన పవన్... ఈ విషయాన్ని ఏపీని పాలిస్తున్న పాలకవర్గం కూడా ఆలోచించాలని సూచించారు. నాగరికతకు అమ్మ ఒడి నుడి అని చెప్పారు. భాష లేనిదే సంస్కృతి లేదని అన్నారు. మాతృ భాష గతిస్తే సంస్కృతి మిగలదని... దీనికి చరిత్రలో ఎన్నో రుజువులు ఉన్నాయని ట్వీట్ చేశారు.

నదీజలాల కాలుష్యం మీద కూడా ఏపీ పాలకులు ఆలోచించాలని పవన్ అన్నారు. కర్నూలులో తుంగభద్రలోకి వదులుతున్న కాలుష్యాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Janasena

More Telugu News