Srisailam: శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడింది.. ఏదైనా జరిగితే ఏపీ సగం కన్పించకుండా పోతుంది: ‘వాటర్ మ్యాన్’ రాజేంద్రసింగ్

  • డ్యాంకు మరమ్మతులు చేయకపోతే విషాదం తప్పదు
  • డ్యాం సమీపంలోని నిర్మాణాలపై దృష్టి సారించాలి
  • ప్రభుత్వం త్వరగా చర్యలు చేపడితే డ్యాం దక్కుతుంది
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరున్న రాజేంద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడిందని, మరమ్మతులు చేయకపోతే విషాదం తప్పదని హెచ్చరించారు. ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని అన్నారు.

 ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించాక వాటి నిర్వహణ గురించి సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. డ్యాం సమీపంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, త్వరితగతిన ప్రభుత్వం చర్యలు చేపడితే కనుక డ్యాంను రక్షించుకోగల్గుతామని సూచించారు. కాగా, గంగాజల్ సాక్షరత్ యాత్రలోదేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని శ్రీశైలం డ్యాంను నిన్న ఆయన సందర్శించారు.
Srisailam
Dam
Water man Of India
Rajendrasingh

More Telugu News