Swiggy- zomato merger news: ఏ కంపెనీతోనూ విలీనంపై మేము చర్చించడం లేదు: జొమాటో అధినేత దీపిందర్ గోయల్

  • స్విగ్గీతో విలీనం ఒప్పందం చేసుకుంటున్నామన్న వార్తలు రూమర్లే
  • మా వ్యాపారంలో లాభాలను పొందుతున్నామన్నది నిజమే
  • సొంతంగా వ్యాపార విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము
కోరిన ఆహారాన్ని వినియోగదారులకు వేగంగా అందిస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ రెండు సంస్థలు విలీనం కానున్నాయన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జొమాటో అధినేత దీపిందర్ గోయల్ ఈ వార్తలు వాస్తవం కాదని ఖండించారు.

విలీనంపై ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. ‘మేము మా వ్యాపారంలో లాభాలను పొందుతున్నాము. వ్యాపార విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము. విలీనం విషయమై మేము స్విగ్గీతో కాని ఇతర సంస్థలతో కానీ చర్చలు జరపడం లేదు’ అని జొమాటో అధినేత తెలిపారు.

కాగా జొమాటో దేశవ్యాప్తంగా లక్షా యాబైవేల రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తన కస్టమర్లకు డెలివరీ చేస్తోండగా, స్విగ్గీ దేశవ్యాప్తంగా లక్షా నలబైవేల రెస్టారెంట్లతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుని ఆహారాన్ని డెలివరీ చేస్తోంది. ఈ రెండు సంస్థల మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి.
Swiggy- zomato merger news
codemn by zomato Cheif Dheepinder goyal

More Telugu News