65 Years Old two persons raped by 50 Years Old Women: ఏభై ఏళ్ల మహిళపై 65 ఏళ్లు పైబడిన ఇద్దరు వృద్ధుల అత్యాచారం

  • గుజరాత్ లోని బనాస్ కంతా జిల్లాలోని ధర్నాల్ గ్రామంలో ఘటన
  • కులం నుంచి వెలివేసిన మహిళను కులంలోకి చేర్చుకుంటామని బలాత్కారం
  • పరారీలో ఉన్న నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు
గుజరాత్ లో  ఓ  50 ఏళ్ల మహిళపై 65 ఏళ్లు పైబడిన ఇద్దరు వృద్ధులు అత్యాచారం జరిపారు. ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు. బనాస్ కంతా జిల్లాలోని ధర్నాల్ గ్రామంలో నివసిస్తున్న 50 ఏళ్ల బాధితురాలు కుమారుడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో కులపెద్దలు ఆమె కుటుంబాన్ని వెలివేశారు. బాధితురాలిని తిరిగి తమ కులంలో కలుపుకుంటామని చెప్పిన కులపెద్దలైన నిందితులు రణ్ చోఢ్ భాయ్ సుతార్, విజోల్ భాయ్ సుతార్ బాధిరాలికి సహాయం చేస్తామని చెప్పి థారా టౌన్ అనే ప్రాంతానికి పిలిపించారు.

ఆమె కుటుంబం మళ్లీ కులంలో కలవాలంటే తమ కోరిక తీర్చాలంటూ బెదిరిస్తూ, ఆమెను బలాత్కరించారు. ఆ తర్వాత కొంత కాలంపాటు ఆమె ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. నిన్న తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేసి, భయపెట్టారన్న దానికి సాక్ష్యంగా సంభాషణల రికార్డింగ్ ను పోలీసులకు అందించింది. నిందితులపై సామూహిక అత్యచారం, బ్లాక్ మెయిలింగ్ కేసులు నమోదు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందుతులకోసం గాలిస్తున్నారు.
65 Years Old two persons raped by 50 Years Old Women
Gujarath

More Telugu News