వంశీ ఇంకా వైసీపీలో చేరలేదు కదా.. వస్తే చూద్దాం!: గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వంశీ ఇంకా వైసీపీలో చేరలేదు కదా.. వస్తే చూద్దాం!: గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు

  • గన్నవరంలో వంశీ వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారు
  • వైసీపీలో చేరతానన్న ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను
  • వంశీ వైసీపీలో చేరతారన్న విషయాన్ని మీడియాలోనే చూశాను
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీలో చేరికపై గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఆయన తమ పార్టీలో చేరితే గన్నవరంలో తనకు వచ్చే నష్టమేమీ లేదన్నట్లుగా మాట్లాడారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు క్యారక్టర్ ఉందని, తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. వంశీ ఇంకా వైసీపీలోకి రాలేదని, వస్తే అప్పుడు చూద్దామని ఆయన అన్నారు. వైసీపీలో చేరతానని వంశీ చేసిన వ్యాఖ్యలపై తాను ఇప్పుడు స్పందించనని చెప్పారు. వంశీ గన్నవరంలో వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారని అన్నారు.  

అసలు వంశీ వైసీపీలో చేరుతున్నారన్న విషయాన్ని తాను మీడియాలో చూడటమే తప్ప తనకూ తెలియదని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలోని తమ కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. తనకు అండగా ఉంటోన్న కార్యకర్తలకు తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను సమస్యలను సృష్టించడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.

Vallabhaneni Vamsi
yarlagadda
YSRCP

More Telugu News