India: భారత వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఆశలు గల్లంతు!

  • ఒమన్ తో క్వాలిఫయర్ మ్యాచ్
  • 0-1 తేడాతో ఓడిన భారత్
  • గ్రూప్-ఈలో నాలుగో స్థానంతో సరి
2022లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనాలన్న భారత ఆశలు గల్లంతయ్యాయి. మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఒమన్ తో తలపడిన భారత జట్టు 0-1తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్ ఈలో ఇండియా కేవలం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండిపోయింది. నాలుగో స్థానంలోని జట్టుకు రెండో రౌండ్ క్వాలిఫయర్ పోటీలు ఆడే అవకాశం లేకపోవడంతో భారత జట్టు కథ ముగిసినట్టే.
India
FIFA
World Cup
Football
Oman

More Telugu News