Nara Lokesh: ఈ మనిషి దేశానికే అపఖ్యాతి తెచ్చిపెడుతున్నారు: జగన్ పై నారా లోకేశ్ విమర్శలు

  • జగన్ పాలనా విధానాలు సరిగ్గా లేవు
  • ప్రతీకార చర్యల కారణంగా విపరీత పరిస్థితులు
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ పెట్టుబడిదారులంటున్నారు
  • ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖను వారు హెచ్చరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. తన తీరుతో దేశానికే అపఖ్యాతి తెస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ పై అంతర్జాతీయ సంస్థలు చట్టబద్ధ చర్యలకు సిద్ధమవుతున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన కథనాలను లోకేశ్ పోస్ట్ చేశారు.  

'ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనా విధానాల వైఫల్యాలు, ఆయన ప్రతీకార చర్యల కారణంగా తలెత్తిన పరిస్థితులతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖను హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు ఇక్కడ అడుగుపెట్టకుండా చేయడమే కాకుండా ఈ మనిషి (జగన్) దేశానికే అపఖ్యాతి తెచ్చిపెడుతున్నారు' అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్ ను ట్యాగ్ చేశారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News