ఏడేళ్ల బాలుడిని చంపిన చిరుతపులి... మేకను ఎరగా వేసి పట్టేసిన అధికారులు!
- దుడ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఘటన
- గ్రామాలపైకి వచ్చి దాడులు చేస్తున్న చిరుత
- బోనులో బంధించి అడవిలో వదిలిన అధికారులు
చిరుత కోసం ఓ బోనును సిద్ధం చేసి, దానిలో మేకను ఉంచామని, మేక కోసం వచ్చిన చిరుత బోన్ లో చిక్కిన తరువాత, దానికి వైద్య పరీక్షలు జరిపి, అడవి మధ్యలో వదిలామని వెల్లడించారు. ఇది పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆడ చిరుతపులని తెలిపారు. ఇకపై ఈ చిరుత కదలికలను అధికారులు రాడార్ల సాయంతో అనునిత్యమూ గమనిస్తుంటారని అన్నారు. ఈ నెల 11న బెలగాడి గ్రామ శివార్లలో మనోజ్ కుమార్ అనే ఏడేళ్ల బాలుడిని ఈ చిరుత చంపేయగా, దీన్ని పట్టుకోవాలని ఆ ప్రాంతంలో ప్రజలు నిరసనలకు దిగారు.