Congress: అసెంబ్లీలో స్పీకర్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఎమ్మెల్యే

  • ఒడిశా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
  • స్పీకర్ పాత్రోకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ ఫ్లయింగ్ కిస్
  • నియోజకవర్గ సమస్యలను లేవనెత్తేందుకు అవకాశమిచ్చినందుకే అలా చేశానన్న ఎమ్మెల్యే
ఒడిశా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఎస్ఎన్ పాత్రోకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఈ సన్నివేశాన్ని చూసిన ఎమ్మెల్యేలంతా నవ్వాపుకోలేకపోయారు. ఈ ఘటనపై తారా ప్రసాద్ స్పందించారు. తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం కల్పించినందుకే స్పీకర్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చానని చెప్పారు. ఇందులో మరో ఉద్దేశం లేదని తెలిపారు.
Congress
MLA
Taraprasad Bahinipati
Flying Kiss
Speaker

More Telugu News