Kesineni Nani: మీ ఎంపీలు మెడలు వంచి సాధిస్తారో, కాళ్లు పట్టుకుని సాధిస్తారో ప్రజలకు చెప్పండి ముఖ్యమంత్రిగారూ!: కేశినేని నాని

  • కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం రేవు ఏర్పాటుపై నిన్న కేంద్రం వివరణ
  • అవి లాభదాయం కాదన్న కేంద్ర హోంశాఖ
  • జగన్ పై కేశినేని నాని విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం రేవు ఏర్పాటు లాభదాయం కాదని కేంద్ర హోంశాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్నింటా మొండి చేయి చూపిందంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2026 జనాభా లెక్కలు అయ్యేంతవరకు అసెంబ్లీ సీట్లను పెంచమని కేంద్రం చెప్పిందని అందులో ఉంది.

'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ.. మీరు మీ 22 మంది ఎంపీలు మెడలు వంచి సాధిస్తారో కాళ్లు పట్టుకుని సాధిస్తారో కొంచం ప్రజలకు చెప్పండి సారు' అని కేశినేని నాని ప్రశ్నించారు. నిన్న లోక్ సభలో కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Kesineni Nani
Jagan
Telugudesam
YSRCP

More Telugu News