Guntur District: గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అనుమానం రాకూడదని కాలేజీ హాస్టళ్ల పక్కనే దందా!

షార్ట్స్‌లో చూడండి
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కాలేజీ పక్కనే దుకాణం తెరిచిన వ్యభిచార ముఠా గుట్టును గుంటూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. చినకాకాని ప్రాంతంలో ప్రైవేటు కళాశాలల హాస్టళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం విద్యార్థులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఓ వ్యభిచార ముఠా ఇక్కడ దందా ప్రారంభించింది.

ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు విటులు, నలుగురు నిర్వాహకులు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Guntur District
S*x racket
Police

More Telugu News