YSRCP MP Raghu Ram: ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఎం జగన్ ఆగ్రహం?

  • పార్లమెంట్ లో ఇంగ్లీష్ మీడియంపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి
  • ఇంగ్లీష్ మీడియంను అడ్డుకుంటే పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకున్నట్లే..
  • ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడితే.. పార్టీ పరంగా చర్యలు?
వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఇన్ ఛార్జీ వైవీ సుబ్బారెడ్డితో సీఎం చర్చించారు. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు  మాట్లాడటంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ ను వ్యతిరేకిస్తే పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకోవడమేనని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని జగన్ అన్నట్లు తెలుస్తోంది.
YSRCP MP Raghu Ram
CM Jagan angry at Raghu ram comments
In Parliament
English Mediaum
Andhra Pradesh

More Telugu News