Telugudesam: కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో టీడీపీ ఎంపీకి స్థానం
- అమిత్ షా అధ్యక్షతన హోంశాఖ సంప్రదింపుల కమిటీ
- కమిటీలో సభ్యుడిగా కనకమేడలకు చోటు
- మారుతున్న పరిస్థితులకు నిదర్శనం?
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కు కేంద్రంలో తగిన గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా కనకమేడలను నియమించారు. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఓ టీడీపీ ఎంపీకి అమిత్ షా ఆధ్వర్యంలోని కమిటీలో స్థానం ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. కనకమేడల టీడీపీ న్యాయవిభాగం చీఫ్ గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్వతహాగా న్యాయవాది. హైకోర్టులో పలు కేసుల్లో సమర్థంగా వాదనలు వినిపించిన ఘనత ఆయన సొంతం.