cm: జగన్ గారూ! వాళ్లను 'బూతుల శాఖ’కు మంత్రులుగా చేయండి: టీడీపీ నేత మాణిక్యాలరావు వ్యంగ్యం

  • ‘బుల్లెట్ దిగిందా? లేదా?’ అని ఒక మంత్రి అంటాడు!
  • ‘నీయబ్బ సొత్తా? అని ఒకడు మాట్లాడతాడు
  • జగన్ మౌనంగా వుంటే కుదరదు.. స్పందించాలి
ఏపీలో మంత్రులు మాట్లాడే భాషపై టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘బుల్లెట్ దిగిందా? లేదా?’ అని ఒక మంత్రి, ‘నీయబ్బ సొత్తా?’.. అని ఒకడు మాట్లాడతాడు. 'వీళ్లందరినీ ఇప్పుడు చేస్తున్న శాఖలకు కాకుండా, బూతుల శాఖలకు మంత్రులుగా చేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. వాళ్లు మాట్లాడేది సరైన పద్ధతా? లేక తప్పా? అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మౌనంగా ఉంటే వీళ్లను అంగీకరించినట్టు అర్థమొస్తుంది’ అన్నారు.
cm
Jagan
Telugudesam
pilli
Manikyala rao

More Telugu News