Telugudesam: కొడాలి నాని భాష సిగ్గుచేటు: టీడీపీ నేత మాణిక్యాలరావు

  • నాని మాట్లాడే భాష దారుణంగా వుంది
  • ఎలా మాట్లాడాలో నాని నేర్చుకోవాలి
  • నాని బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలి
చంద్రబాబు, ఆయన తండ్రిని ఉద్దేశించి, అలాగే, అత్యంత పవిత్రస్థలమైన తిరుపతి గురించి ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడిన భాష సిగ్గుచేటని టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నీ అబ్బ కట్టించాడా?’ ‘నీ అమ్మ మెుగుడికి చెప్పాలా?’ అంటూ నాని చేసిన వ్యాఖ్యలు దారుణంగా వున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక శాసనసభ్యుడు అయిన కొడాలి నాని ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంది ప్రజలకు సేవ చేయడానికా? లేక వారి బూతుపురాణం వినేందుకా? అని ధ్వజమెత్తారు.
Telugudesam
Manikyala rao
YSRCP
Kodali Nani

More Telugu News