Avanthi: అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకుంటున్నా: మంత్రి అవంతి వివరణ

  • అయ్యప్ప దీక్షలో చెప్పులు ధరించారని మంత్రిపై విమర్శలు
  • తనకంటే ఎక్కువగా హిందు మతాన్ని ప్రేమించేవాళ్లు లేరన్న అవంతి
  • టీడీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పులు ధరించానని వెల్లడి
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు. అయ్యప్ప దీక్ష చేపట్టి కాలికి పాదరక్షలు ధరించడం ఏంటని అవంతిపై పలువురు విమర్శలు చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ, అనారోగ్యం కారణంగానే కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నానని, అయ్యప్ప దీక్షను అగౌరవపర్చడానికి కాదని స్పష్టం చేశారు.

తనకంటే హిందూ మతాన్ని అధికంగా ప్రేమించేవాళ్లు ఇంకెవరూ ఉండబోరని ఆయన చెప్పారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కూడా మాల ధరించినప్పుడు చెప్పులు వేసుకున్నానని తెలిపారు. అప్పుడు పవిత్రంగా కనిపించిన తాను ఇప్పుడు అపవిత్రుడ్నయ్యానా? అంటూ ప్రశ్నించారు. అంతెందుకు, మురళీమోహన్ కూడా దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటారని అవంతి వెల్లడించారు.
Avanthi
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News