Bajaj Chetak: మళ్లీ వస్తున్న బజాజ్ చేతక్... ఈసారి కొత్త వెర్షన్!

  • ఎలక్ట్రిక్ స్కూటర్ గా వస్తున్న బజాజ్ చేతక్
  • మహారాష్ట్ర చకన్ యూనిట్లో తయారీ
  • వెల్లడి కాని ధర!
కొన్నేళ్ల కిందట భారత్ లో స్కూటర్లు రాజ్యమేలిన కాలంలో బజాజ్ చేతక్ కు విపరీతమైన డిమాండ్ ఉండేది. కాలగమనంలో వెనుకబడిపోయిన ఈ స్కూటర్ తయారీని బజాజ్ సంస్థ నిలిపివేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తన పాతకాపుకు కొత్తరూపు కల్పించి మళ్లీ రంగంలోకి దించాలని బజాజ్ నిర్ణయించుకుంది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ గా మార్కెట్లో ప్రవేశించనుంది. దీనికి అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ సుమారు 70,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని కంపెనీ వర్గాలంటున్నాయి. 5 గంటల్లోనే 80 శాతం చార్జింగ్, అల్లాయ్ వీల్స్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ దీని ప్రత్యేకతలు.

ఈ కొత్తతరం చేతక్ ను మహారాష్ట్రలోని చకన్ యూనిట్ లో తయారుచేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ యూనిట్లో అందరూ మహిళలే. చేతక్ పునరాగమనం విజయవంతం అవుతుందని బజాజ్ గట్టినమ్మకం పెట్టుకుంది. కాగా, దీని ధర ఎంతన్నది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.
Bajaj Chetak
Scooter
India
Maharashtra

More Telugu News