VarlaRamaiah: సభ్య సమాజం సిగ్గు పడేరీతిలో పదజాలం వాడుతున్నారు: ఏపీ మంత్రులపై వర్ల రామయ్య విమర్శలు

  • దినదినము మీ మంత్రి మండలి ఔన్నత్యం దిగజారిపోతోంది
  • కొందరు విలువలకు తిలోదకాలిస్తున్నారు
  • జగన్ మౌనం వహిస్తే వారిని సమర్థించినట్లే
  • అమాత్యుడు సమాజంలో మోడల్ గా ఉండాలిగా?
ఆంధ్రప్రదేశ్  మంత్రి మండలి ఔన్నత్యం దిగజారిపోతోందని, అందులోని కొందరు సభ్యులు సభ్యసమాజం సిగ్గు పడేరీతిలో బూతు పదజాలం వాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ విషయంపై సీఎం జగన్ మౌనం పాటించడం సరికాదని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

'అయ్యా, ముఖ్యమంత్రి గారు! దినదినము మీ మంత్రి మండలి ఔన్నత్యం దిగజారిపోతోంది. కొందరు విలువలకు తిలోదకాలిచ్చి సభ్యసమాజం సిగ్గు పడేరీతిలో బూతు పదజాలం వాడుతున్నారు. తప్పు.. మందలించి సరైన మార్గంలో పెట్టవలసిన మీరు మౌనం వహిస్తే వారిని సమర్థించినట్లే. అమాత్యుడు సమాజంలో మోడల్ గా ఉండాలిగా???' అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
VarlaRamaiah
Telugudesam
YSRCP
Jagan

More Telugu News