petrol: చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో కలకలం.. సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు

  • నలుగురు సిబ్బందిపై పడ్డ పెట్రోల్
  • భూమి పట్టా మంజూరు చేయట్లేదని  రైతు ఆవేదన  
  • రైతు కనకయ్య అరెస్టు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో కలకలం చెలరేగింది. ఆ కార్యాలయ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రోల్ చల్లాడు. సీనియర్ అసిస్టెంట్ రామచందర్, వీఆర్వో అనిత, కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్, అటెండర్ దివ్యపై పెట్రోల్ పడింది. ఆ కార్యాలయ సిబ్బంది భూమి పట్టా మంజూరు చేయట్లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విషయాన్ని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్.. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ శాఖలో ఇటువంటి మరో ఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోంది.  
petrol
Karimnagar District
Crime News

More Telugu News