Ram Gopal Varma: హైదరాబాద్ దాదాగిరిపై సినిమా తీయబోతున్నా!: రామ్ గోపాల్ వర్మ

  • విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అయిపోయారు
  • 'శివ' సినిమానే దీనికి స్ఫూర్తి
  • 'జార్జిరెడ్డి' ఫేం సందీప్ మాధవ్ ప్రధాన పాత్రను పోషిస్తాడు
'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ తో ఇప్పటికే వేడి పుట్టిస్తున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రానికి కూడా పవర్ ఫుల్ కథాంశాన్నే ఎంచుకున్నాడు. తన తదుపరి చిత్రం ఏంటో వర్మ ప్రకటించాడు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అయిపోయారని... ఇప్పుడు హైదరాబాద్ దాదాగిరిపై సినిమా తీయబోతున్నానని తెలిపాడు. 1980లలో హైదరాబాదులో నెలకొన్న దాదాగిరి, దాదాలపై ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కబోతోందని... ఈ చిత్రానికి 'శివ' సినిమానే స్ఫూర్తి అని తెలిపాడు. 'హైదరాబాద్ దాదాలు' చిత్రంలో 'జార్జిరెడ్డి' ఫేం సందీప్ మాధవ్ ప్రధాన పాత్రను పోషిస్తాడని చెప్పాడు.
Ram Gopal Varma
RGV
New Film
Hyderabad DADA
Tollywood

More Telugu News