Rajya Sabha: కొత్త డ్రెస్ కోడ్ లో మెరిసిపోతున్న రాజ్యసభ మార్షల్స్

  • 250వ సమావేశాలను జరుపుకుంటున్న రాజ్యసభ
  • సైనికాధికారుల తరహాలో మార్షల్స్ కు కొత్త డ్రెస్ కోడ్
  • గతంలో సఫారీ దుస్తులు, తలపాగాను ధరించిన మార్షల్స్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ఓ ప్రాధాన్యత ఉంది. రాజ్యసభ తన 250వ సమావేశాలను జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ మార్షల్స్ కు కొత్త డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారితో పాటు, సభ సచివాలయ సిబ్బంది, రాజ్యసభ సభ్యులకు సహకరించే మార్షల్స్ సఫారీ దుస్తులు, తలపాగాతో కనిపించేవారు.

అయితే, నేటి అవసరాలకు తగ్గట్టు తమ డ్రెస్ కోడ్ ను ఆధునిక రూపంలోకి మార్చాలంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని మార్షల్స్ కోరారు. వారి విన్నపాన్ని అంగీకరించిన వెంకయ్య... సైనికాధికారుల తరహాలో వారి నూతన డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చారు.
Rajya Sabha
Marshals
New Dress Code

More Telugu News